ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌లో చల్లారని ఫ్లెక్సీ చిచ్చు

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:07 PM

మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపిన వ్యవహారం కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నేతలు ఆ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. మరి కొందరు వీలుంటే పోలీసుల సాయం తీసుకుని వారిపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల మేడ్చల్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో చింపిన ఫ్లెక్సీ

-చింపిన వారిని వదలమంటున్న నేతలు

-గుప్పుమంటున్న గ్రూపు రాజకీయాలు

-సీరియస్‌ తీసుకున్న పార్టీ అధిష్ఠానం

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపిన వ్యవహారం కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నేతలు ఆ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. మరి కొందరు వీలుంటే పోలీసుల సాయం తీసుకుని వారిపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం, గ్రంథాలయం చైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు, ఇతర బడా నేతలు విచ్చేస్తున్నదున వారి స్వాగతం కోసం స్థానిక కాంగ్రెస్‌ నేతలు మేడ్చల్‌ జాతీయ రహదారి పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. కాగా, వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చింపిన విషయం విధితమే. ఈ చర్యకు సొంత పార్టీ వారే పాల్పడ్డారంటూ ఒక వర్గం నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాగా, కార్యక్రమానికి మంత్రులు, ప్రముఖులు హాజరు కాలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నేతలకు ప్లెక్సీలు, కటౌట్‌లు చించడం మరింత మనస్తాపానికి గురిచేసింది. దీంతో ఈ వ్యహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు పోవడానికి ఆ వర్గం నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు

వదలమంటున్న నేతలు

ఫ్లెక్సీల వ్యవహారంతో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఈ విషయమై అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీల ఏర్పాటులో ప్రొటోకాల్‌ పాటించ లేదంటూ స్వయాన జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి బహిరంగంగా ఆరోపణ చేయటంతో పాటు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నేతల మధ్య సమన్వయం, సఖ్యత లేని కొరణంగా ఇలాంటి పరిస్థితులు తలేత్తుతున్నాయని కొందరు నేతలు అవేదన వ్యక్తు చేస్తున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయలను ప్రొత్సహిస్తున్న నేతల కారణంగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. కుల రాజకీయాలతో కొందరు చిచ్చు పెడుతుండగా ఆధిపత్యం కోసం మరి కొందరు పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్స హిస్తూన్నారంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాగా ఇక్కడ వార్డు నేతకూడా సీఎం రేవంత్‌ రెడ్డి పేరు చెప్పుకుని పెత్తనం చెలాయిస్తున్నందున ఈ పరిస్థితి దాపురించిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 29 , 2024 | 11:07 PM