ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూమి విషయంలో మోసం.. వ్యక్తి రిమాండ్‌

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:51 PM

భూమి విషయంలో మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో జరిగింది.

నవాబుపేట, సెప్టెంబరు 15: భూమి విషయంలో మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌గౌడ్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని మాదిరెడ్డిపల్లి గ్రామ శివారులో అంకరావు, శ్రీనివాస్‌రావు అలియాస్‌ రాజేశ్‌, వంగ రాజేందర్‌రెడ్డి, వంగ అంకిత్‌రెడ్డిలు కలిసి సర్వే నెం.59, 60లో 32 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వీరిలో ఒంటిపులి శ్రీనివాస్‌రావు అలియాస్‌ రాజేశ్‌, వంగ రాజేందర్‌రెడ్డి, అంకిత్‌రెడ్డిలు ఆ భూమిని విక్రయించారు. భూమిని తనతో పాటు కొనుగోలు చేసి తన ప్రమేయం లేకుండా భూమిని విక్రయించి తనకు మోసం చేశారని అంకరావు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనలో ఒంటిపులి శ్రీనివాస్‌రావు అలియాస్‌ రాజేశ్‌ను ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:51 PM

Advertising
Advertising