Hyderabad: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్
ABN, Publish Date - Oct 13 , 2024 | 11:05 AM
హైదరాబాద్, శివార్లలోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట్ పరిధిలో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడా ఎర్రబోడలో గంజాయి గ్యాంగ్ (Ganjay gang ) రెచ్చిపోయింది. ఉదయం వాకింగ్ (Walking) చేసి ఇంటికి వస్తున్న వాకర్స్‌పై గంజాయి గ్యాంగ్ కర్రలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిపై సైతం దాడి చేశారు. పార్కింగ్ చేసిన కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. పోకిరీలు తరచూ గంజాయి సేవించి వచ్చి పోయే వారిపై దాడి చేస్తున్నారు. గ్యాంగ్ సభ్యులు నిర్మానుష్య ప్రాంతంలో ప్రతి రోజు గంజాయి సేవిస్తున్నారు. తెల్లవారు జామున రెచ్చిపోయి బూతులు తిడుతూ దాడికి తెగబడుతున్నారు. 5గురు గ్యాంగ్ సభ్యులు ఉన్నారు. బస్తీ వాసులు పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. రోడ్ల పై తిరగాలంటే భయం వేస్తుందని బస్తీ వాసులు వాపోతున్నారు. కుటుంబతో కలసి వెళ్లాలంటే గంజాయి గ్యాంగ్‌తో భయం వేస్తోందని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, శివార్లలోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బైటపడుతూనే ఉన్నాయి. ఇటీవల రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట్ పరిధిలో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వీళ్ల నుంచి రెండున్నర లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనమైంది. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేసి.. 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వైజాగ్‌లో చిన్నచిన్న ప్యాకెట్లలో చవకగా దొరికే హ్యష్ ఆయిల్ తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో ఒక ముఠా అమ్ముతోంది. ఇందులో మొత్తం ఐదుగురు. రంజిత్ కుమార్ అనే ప్రధాన నిందితుడు పేరుకే డ్రైవర్.. చేసేది మాత్రం డ్రగ్ పెడలింగ్. ఎక్సైజ్ పోలీసులు ఒకసారి అరెస్టు చేసినా.. జైలునుంచి బైటికొచ్చి మళ్లీమళ్లీ ఇదే పని చేస్తున్నాడు. గంజాగాళ్ల గలీజు పనుల్లో ఇంతకంటే కన్నింగ్ ఏంటంటే గంజాయి చాక్లెట్లు. చూడ్డానికి మామూలు బ్రాండెడ్ చాకొలెట్లలా ఉంటాయి కనుక.. వాటిని అమ్ముతున్న వాళ్లను కనిపెట్టడం కష్టం. ఆ వీక్‌నెస్సే గంజాయి చాక్లెట్లను హాట్‌కేకులుగా మార్చేశాయ్. బీహార్ నుండి చాక్లెట్లను తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్న సంతోష్, బీరేందర్ సింగ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విదేశీ మద్యం ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..
ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 13 , 2024 | 11:06 AM