బాలికలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:13 AM
బాలికలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి ఉన్న లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పొన్న శ్రీదేవి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పొన్న శ్రీదేవి
ఇబ్రహీంపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాలికలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి ఉన్న లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పొన్న శ్రీదేవి అన్నారు. రాజ్యాంగ పరమైన హక్కులు ఉపయోగించుకొని సర్వతోముఖాభివృద్ధి సాధించాలని సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. అధికరణ 21-ఏ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారిందని, విద్యా హక్కు చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అమలులో ఉందన్నారు. బాల్య వివాహాలు నేరమని, వీటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఈవో సుశీందర్‌రావు మాట్లాడుతూ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సీహెచ్.రవి మాట్లాడుతూ పిల్లలతో పనులు చేయించడం నేరమన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హీర్యా నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోప్యాయులు రవీందర్, కె.రవి పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 12:13 AM