ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన గుడ్లనే వాడాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:07 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలకు, గర్భిణీలకు బలవర్దకమైన ఆహారం అందించాలని, నాణ్యమైన గుడ్లను మాత్రమే వాడాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మోతీ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజారమణిలు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లను ఆదేశించారు.

కందుకూరు, సెప్టెంబరు 4 : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు బాలింతలకు, గర్భిణీలకు బలవర్దకమైన ఆహారం అందించాలని, నాణ్యమైన గుడ్లను మాత్రమే వాడాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మోతీ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజారమణిలు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లను ఆదేశించారు. బుధవారం మండలంలోని ఊట్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. కేంద్రానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేస్తున్నారా? లేదా? అనే విషయమై ఆరా తీశారు. గుడ్లను పగుల కొట్టి నాణ్యతను పరిశీలించారు. ప్రీస్కూల్‌ తల్లులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ట్రే గుడ్లు 1500 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటేనే తీసుకోవాలని, లేనిచో వాపస్‌ చేయాలని అంగన్‌వాడీ టీచర్‌ను ఆదేశించారు. తక్కువ సైజ్‌లో గుడ్లు ఉంటే తీసుకోరాదన్నారు. నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తే తగిన చర్యలుంటాయని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. ప్రీస్కూల్‌ పిల్లల హాజరు శాతం పెంచాలని టీచర్‌ను ఆదేశించారు. అనంతరం కందుకూరు చౌరస్తాలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారితో సీడీపీవో శాంతిశ్రీ తదితరులున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:07 AM

Advertising
Advertising