ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌-3ని సజావుగా నిర్వహించాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:19 AM

గ్రూప్‌-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ సుధీర్‌ అధికారులకు సూచించారు. బుధవారం ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో కలిసి టీజీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ సుధీర్‌

వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ సుధీర్‌

వికారాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్‌-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ సుధీర్‌ అధికారులకు సూచించారు. బుధవారం ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో కలిసి టీజీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ 10,196 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు 31 కేంద్రాలనే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులు ఎలాంటి తప్పిదాలు చేసిన తీవ్రమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. మహిళా అభ్యర్థులను తనిఖీ చేసే క్రమంలో కచ్చితంగా మహిళా సిబ్బంది, మహిళా పోలీసులు ఉండాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రానికిగంట ముందే రావడానికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్లు అరవింద్‌ రెడ్డి, నరేంద్రబాబు, డీఎ్‌సపీ జానయ్య, హెచ్‌ సెక్షన్‌ సూపరరింటెండెంట్‌ నేహమత్‌ అలీలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

నవంబరు 17, 18 తేదీలలో నిర్వహించే గ్రూప్‌-3 పరీక్షకు సంబంధించి కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ సుధీర్‌ తెలిపారు. పరీక్షలపై ఏవైనా సమస్యలు సందేహాలు ఉంటే నవంబర్‌ 14 నుండి 18 వరకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు 08416235291 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

మేడ్చల్‌ జిల్లాలో 65,361మంది అభ్యర్థులు : కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌ ప్రతినిధి, నవంబర్‌ 13(ఆంధ్రజ్యోతి) : గ్రూప్‌ - 3 పరీక్షలకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 65,361మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 115 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్ధులు కమిషన్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎ్‌సపీఎ్‌ససీ.జీవోవి.ఇన్‌లో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కలెక్టర్‌ సూచించారు. అభ్యర్ధులు మొదటి సెషన్‌కు ఉపయోగించిన హాల్‌టికెట్‌నే మిగిలిన సెషన్‌లకు ఉపయోగించాలని కలెక్టర్‌ సూచించారు. తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్ధులు తప్పనిసరిగా హాల్‌ టికెట్‌ను, అన్ని సెషన్‌ల ప్రశ్నాపత్రాలను భద్రపరుచుకోవాలన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే టీజీపీఎస్సీ టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్లు 040-23542185, 040-23542187 లలో సంప్రదించవచ్చునని కలెక్టర్‌ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్ధులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 12:19 AM