హరహర మహాదేవ..
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:16 AM
జిల్లావ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో సోమవారం కార్తీక మాస పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో సోమవారం కార్తీక మాస పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలోని పలు దేవాలయాలు, మైసిగండి మైసమ్మ, శివరామాలయం, మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయం, శంకర్‌పల్లి మండలం చందిప్పలోని మరకత శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. ఆమనగల్లు / మహేశ్వరం/శంకర్‌పల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి )
Updated Date - Nov 12 , 2024 | 12:16 AM