ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:05 AM

హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజేందర్‌ అన్నారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎం అండ్‌ హెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టం పోర్టల్‌పై రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ, హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంయుక్తంగా హెచ్‌ఎంఐయ్‌స పోర్టల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రోగ్రాం అధికారి రాజేందర్‌

హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజేందర్‌

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 21 : హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజేందర్‌ అన్నారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎం అండ్‌ హెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టం పోర్టల్‌పై రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ, హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంయుక్తంగా హెచ్‌ఎంఐయ్‌స పోర్టల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై సందేహాలుంటే.. ఉచిత హెల్ప్‌లైన్‌ నంబర్‌-1097కు ఫోన్‌చేసి సలహాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ, లైంగిక సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఐసీటీసీ, డీఎ్‌సఆర్‌సీ సేవల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌, అదనపు అధికారి డాక్టర్‌ అరుణ, జిల్లా హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సిబ్బంది రాజేందర్‌, నరేందర్‌, శ్రీశైలం, ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది, ప్రభుత్వాసుపత్రిలోని రిపోర్టింగ్‌ సూపర్‌ వైజర్లు, డీఈవోలు, సబ్‌సెంటర్‌ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

పకడ్బందీగా.. ‘పది’ పరీక్షలు

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 21 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. గురువారం నిర్వహించిన మూడో పేపర్‌.. ఇంగ్లీష్‌ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 50,895 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 50,744 మంది హాజరయ్యారు. మిగతా 151 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు 99.70 శాతం నమోదైంది. అలాగే ప్రైవేట్‌ విద్యార్థులకు సంబంధించి 93 మంది విద్యార్థులకుగాను 76 మంది పరీక్ష రాశారు. 17మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారు. ఫ్లయింగ్‌స్వ్కాడ్‌ 68 మంది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:05 AM

Advertising
Advertising