ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకెన్నాళ్లు?

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:05 PM

తుమ్మలూరు మీదుగా మహేశ్వరం, శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో పది నెలలుగా ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.

కంకర వేసి వదిలేసిన తుమ్మలూరు-మహేశ్వరం రోడ్డు

అసంపూర్తిగా తుమ్మలూరు-మహేశ్వరం రోడ్డు

నత్తనడకన రహదారి విస్తరణ పనులు

ప్రయాణికుల ఇక్కట్లు.. పట్టని అధికారులు, పాలకులు

మహేశ్వరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తుమ్మలూరు మీదుగా మహేశ్వరం, శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో పది నెలలుగా ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో రోడ్డు విస్తరణ పనుల కోసం 5 కిలోమీటర్లకు గాను రూ.14కోట్లు విడుదలయ్యాయి. ప్రారంభంలో పనుల వేగవంతం చేసిన కాంట్రాక్టర్‌ ఆ తర్వాత నిర్లక్ష్యం చేశాడు. దాంతో తుమ్మలూరు-మహేశ్వరం ప్రజలే కాకుండా రెండు జాతీయ రహదారులైన శ్రీశైలం, బెంగళూరు జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు పనులు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకర రాళ్ల వల్ల వాహనాలు పాడవుతున్నాయని, ధుమ్ముతో నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై నుంచి వెళ్లే వాహనాలు శ్రీశైలం జాతీయ రహదారికి చేరుకోవాలంటే తుమ్మలూరు-మహేశ్వరం రోడ్డు మార్గం తప్పనిసరి. అయితే, రోడ్డు విస్తరణ పనులు పది నెలలుగా నత్తనడకన సాగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెరుగుతుందా? అని వాహనదారులు, ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. తుమ్మలూరు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌నాయక్‌ను గ్రామానికి చెందిన యువత కలిసి మొరపెట్టుకున్నారు.

పది నెలలుగా సాగని పనులు

గత పది నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.14కోట్లు విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్‌ పనులను వేగవంతం చేయడం లేదు. కంకర కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పనులు ప్రారంభించాలని గ్రామ యువకులు ధర్నాలు చేసినా పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. వీలైంనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

- కె. శ్రీహరి, తుమ్మలూరు మాజీ ఉపసర్పంచ్‌

Updated Date - Nov 21 , 2024 | 11:05 PM