కష్టపడితే అసాధ్యం సుసాధ్యమే
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:52 PM
కష్టపడితే అసాధ్యం సుసాధ్యమేనని ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ నందిని అగసారా అన్నారు. వికారాబాద్ అనంతగిరి పల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో గురువారం జరిగిన 10వ ఓనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.
ఇష్టంతో సాధన చేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చు
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం
ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ నందిని
అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో స్పోర్ట్స్ మీట్
వికారాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కష్టపడితే అసాధ్యం సుసాధ్యమేనని ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ నందిని అగసారా అన్నారు. వికారాబాద్ అనంతగిరి పల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో గురువారం జరిగిన 10వ ఓనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని ఎంత కష్టమైనా ఇష్టంతో సాధన చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. గురుకుల పాఠశాలలో ఉన్న సౌకర్యాలు మరెక్కడా ఉండవన్నారు. ఇక్కడ క్రీడల్లో తర్ఫీదు పొందితే జాతీయ స్థాయిలో రాణించగలమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదైనా పనిచేస్తే పూర్తి ఏకాగత్రతో, ఇష్టంతో చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి వెంకటరవణ మాట్లాడుతూ.. విద్యార్థులు ఏదైనా సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, ప్రతీ ఆలోచన విజయం వైపు దూసుకెళ్లే విధంగా ఉండాలన్నారు. విద్యార్థులు మరింత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దిశ సభ్యుడు వడ్లనందు, ప్రిన్సిపాల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్, పలువురు వ్యాయమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:52 PM