ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యథేచ్ఛగా చెట్ల నరికివేత

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:25 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి.

సంస్కృతి టౌన్‌షిప్‌ రోడ్డులో నరికేసిన చెట్లు

  • విద్యుత్‌ తీగలకు తగులుతున్నాయని సగం వరకు చెట్ల నరికివేత

  • ముందుచూపు లేని అధికారులు

  • విద్యుత్‌ లైన్లకింద మొక్కలు నాటకుండా చూడాలని వినతి

ఘట్‌కేసర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. అవి కాస్త విద్యుత్‌ తీగలకు తగులుతుండటంతో విద్యుత్‌ అధికారులు చెట్లకొమ్మల నరికివేతకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల చెట్ల కొమ్మలకు బదులుగా చెట్లను సగం వరకు నరికివేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ నుంచి సంస్కృతి టౌన్‌షిప్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వృక్షాలను విద్యుత్‌ సిబ్బంది సగం వరకు నరికివేశారు. ఇన్ని రోజులు ఎంతో ఆహ్లాదాన్నిచ్చిన పచ్చని చెట్లు లేక ప్రస్తుత ఈ రోడ్డు బోసిపోయి కనిపిస్తోంది. విద్యుత్‌ లైన్ల కింద మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి పెద్దయ్యాక నరికివేతకు గురవడం పరిపాటిగా మారింది. చెట్లను నరికే పనిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడంతో యంత్రాలతో ఇష్టానుసారంగా నరికివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా వారు కలపకోసమే చెట్లను సగంవరకు నరికేస్తున్నారని పర్యవరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి చెట్లు నాటే సమయంలో బలంగా ఉండే చెట్లను నాటడంతోపాటు తీగల కింద తక్కువ ఎత్తు పెరిగే మొక్కలను నాటేవిధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

చెట్లను నరికేయడం విచారకరం: బెజ్జంకి హరిప్రసాదరావు, సంస్కృతి టౌన్‌ షిప్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

అన్నోజిగూడ నుంచి టౌన్‌షిప్‌ వరకు గల ప్రధాన రోడ్డులో ఒక వైపు తీగలకు తగులుతున్నాయనే కారణంతో చెట్లను సగం వరకు నరికేయడం విచారకరం. పచ్చని చెట్లు నరికివేయడంతో రోడ్డంతా బోసిపోయింది. సంస్కృతి టౌన్‌ షిప్‌లో పచ్చదనంకు అధిక ప్రధాన్యతనిస్తుంటే మరోపక్క చెట్లను ఇష్టాను సారంగా తొలగించడంను చూస్తుంటే బాధ కలుగుతోంది.

విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు: ప్రదీ్‌పకుమార్‌, విద్యుత్‌ ఏఈ, నారపల్లి

పలుచోట్ల విద్యుత్‌ తీగలకింద చెట్లు ఉండటం వల్ల తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఏడాదిలో మూడుసార్లు చెట్లకొమ్మలు తొలగించాల్సి వస్తోంది. వర్షాకాలం ప్రారంభంలో వీచే ఈదురు గాలులకు పలుమార్లు చెట్లభారీ కొమ్మలు విరిగి వైర్లపై పడటం వల్ల స్తంభాలు విరిగిపోయాయి. దీంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. చిన్నచిన్న మండలను మాత్రమే తొలగిచాం. భవిష్యత్తులో పెద్దకొమ్మలు నరకకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Nov 24 , 2024 | 12:25 AM