ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:38 AM

కుటుంబ సభ్యులతో ముఠాగా ఏర్పడి కాపర్‌ వైర్‌ చోరీకి పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగలను ఆమనగల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆమనగల్లు, సెప్టెంబరు 17: కుటుంబ సభ్యులతో ముఠాగా ఏర్పడి కాపర్‌ వైర్‌ చోరీకి పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగలను ఆమనగల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసు స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి సీఐ బి.ప్రమోద్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన వజ్రగిరి సత్యరాజు, వజ్రరిగి మధు తమ కుటుంబ సభ్యులతో చోరీలు చేస్తున్నారు. వ్యవసాయ బోరు మోటార్లు ఎత్తు కపోయి కాపర్‌వైరును అమ్ముకునేవారు. అలాగే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లలో కాపర్‌వైరు, సెల్‌ టవర్ల బ్యాటరీలను అపహరిస్తున్నారు. గత జూలై 19న మేడిగడ్డలోని సోలార్‌ప్లాంట్‌లో రూ.10వేల విలువ చేసే కేబుల్‌చోరీ చేశారు. ఆమనగల్లు సమీపంలోని సేవాలాల్‌ గుట్ట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సత్యరాజు, మధులను అదుపులోకి తీసుకొని విచారించారు. మేడిగడ్డ గేటు వద్ద సోలార్‌ ప్లాంట్‌ వైర్‌చోరీ, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, మ హబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌, నారాయణపేట జిల్లా అడ్డాకుల, చిన్నచింతకు ంట, మక్తల్‌లో 9చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. సత్యరాజు, మధులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. చోరీ కేసు నిందితులను అరెస్ట్‌ చేసిన ఎస్‌ఐలు వెంకటేశ్‌, శ్రీకాంత్‌, సిబ్బంది శివకుమార్‌, రఘు, జాషువాలను సీఐ అభినందించారు.

Updated Date - Sep 18 , 2024 | 07:05 AM

Advertising
Advertising