క్రీడలతో అంతర్జాతీయ ఖ్యాతి
ABN, Publish Date - Oct 20 , 2024 | 11:52 PM
క్రమశిక్షణ, పట్టుదలతో ఎదిగే క్రీడాకారులకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చటాన్‌పల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు నందారం అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది.
షాద్‌నగర్ అర్బన్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ, పట్టుదలతో ఎదిగే క్రీడాకారులకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చటాన్‌పల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు నందారం అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. 16 రోజుల పాటు కొనసాగిన పోటీల్లో 76 జట్లు పాల్గొన్నాయి. చివరిగా షాద్‌నగర్‌కు చెందిన గల్లీ టీం విన్నర్‌గా, రాయల్స్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. విజేత టీమ్‌కు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్‌లు రూ.50వేల నగదు, ట్రోఫీని ఇచ్చారు. రన్నర్‌కు రూ.30వేల నగదు, ట్రోఫీని బహూకరించారు. బీఆర్‌ఎస్ నాయకులు నటరాజ్, తాండ్ర వెంకట్‌రెడ్డి, చల్లా పాండురంగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 11:52 PM