కారుణ్యం కరుణించేనా?
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:45 PM
స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. 28 నెలలుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
28 నెలలుగా నిలిచిన నియామకాలు
33మంది బాధిత కుటుంబాల ఎదురుచూపులు ఫలించేదెప్పుడో?
వికారాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. 28 నెలలుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 2022, జూలై నెల వరకు కారుణ్య నియామకాలు చేపట్టిన జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం.. ఆ తరువాత వివిధ కారణాలతో నిలిపివేసింది. ఉద్యోగుల పదవీ విరమణ గడువును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఇంతవరకు ఖాళీలు ఏర్పడడం లేదు. జీవో 317 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల విభజనలో జిల్లాలో వివిధ కేడర్ల పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. ఇటీవల ఉద్యోగ విరమణల ప్రక్రియ ప్రారంభమైనా జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉద్యోగ విరమణలు కొనసాగడం లేదు. జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తేనే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అవుతాయి. లేకపోతే ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఆర్థికశాఖ అనుమతి వస్తేనే నియామకాలకు మార్గం సుగమమవుతుంది. స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం మృతిచెందిన 33 ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారసులు జిల్లా పరిషత్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామకాల కింద డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, తెలుగు, ఇంగ్లీష్ హయ్యర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు టైపిస్టులుగా ఉద్యోగాల్లో నియమిస్తారు. పదో తరగతి వరకు చదువుకున్న అభ్యర్థులను ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్లో నియామకం చేస్తారు. జడ్పీ పరిధిలో టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కాగా, జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో 24 మంది జూనియర్ అసిస్టెంట్, 9 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అర్హతలు కలిగి ఉన్నారు. సబార్డినేట్ ఉద్యోగాల అర్హత ఉన్న వారు కూడా డిగ్రీ పూర్తి చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ విద్యార్హత
Updated Date - Nov 14 , 2024 | 11:45 PM