ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహేశ్వరం ‘ఏఎంసీ చైర్మన్‌’ కందుకూరుకేనా?

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:52 PM

ఎనిమిది మాసాలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన పలురకాల సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటు పాలక వర్గం అటు ప్రభుత్వ పర్యవేక్షణలేక రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు.

మహేశ్వరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

కేఎల్లార్‌ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి దూరమౌతున్న మహేశ్వరం గిరిజన నాయకులు

చైర్మన్‌ కుర్చీకోసం ఆశపడి భంగపడిన నాయకులను బుజ్జగించే పనిలో మాజీ ఎమ్మెల్యే

నాలుగోసారీ కందుకూరుకు చెందిన వ్యక్తినే ప్రతిపాదించడంపై నాయకుల గుర్రు..

మహేశ్వరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఎనిమిది మాసాలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన పలురకాల సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటు పాలక వర్గం అటు ప్రభుత్వ పర్యవేక్షణలేక రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని వేయికళ్లతో ఎదురు చూస్తున్న మాహేశ్వరం మండల కాంగ్రెస్‌ గిరిజన నాయకులకు చివరకు నిరాశే మిగిలింది. మహేశ్వరం మార్కెట్‌ కమిటీ రిజర్వేషన్లను గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2015-16లోనే 5 విదతలుగా ఒకేసారి లాటరీ పద్దతిన ప్రకటించింది. ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ నుంచి 2015లో విడిపోయి నూతనంగా ఏర్పాటైన మహేశ్వరం మార్కెట్‌ కమిటీకి రెండు పర్యాయాలు జనరల్‌ మహిళ, మూడో విడత జనరల్‌, నాలుగో విడత ఎస్టీ జనరల్‌, ఐదో విడత జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కింద కేటాయించారు. ప్రస్తుతం కొలువుదీరనున్న మహేశ్వరం మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్‌ కావడంతో కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన అధికార పార్టీ కాంగ్రెస్‌ నాయకులు చైర్‌పర్సన్‌ కోసం కాంగ్రెస్‌ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ ఎంతోకాలంగా పార్టీ కోసం తాము చేసిన కృషిని వివరిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న సమయంలో నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఉన్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్‌) మూడు పర్యాయాలు కందుకూరు మండల నాయకులు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగారని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మహేశ్వరానికే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కేఎల్లార్‌.. చివరి నిమిషంలో నాలుగోసారీ కందుకూరు మండలానికి చెందిన కృష్ణానాయక్‌ పేరును చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దాంతో మహేశ్వరం మండల కాంగ్రెస్‌ గిరిజన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో కేఎల్లార్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

నాలుగో విడతా కందుకూరుకేనా?

మహేశ్వరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీని 2015-16 లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్‌ పదవిని మూడు విడతలుగా కందుకూరు మండలానికి చెందిన నేతలకే కేటాయించడంతో ఈసారి మహేశ్వరం మండలానికి చెందిన నాయకులకే పదవి వరిస్తుందన్న ఆశలు కూడా ఆవిరయ్యాయి. నాలుగో విడత కందుకూరు మండల నాయకులకే చైర్మన్‌గిరి దక్కుతుండడంతో మహేశ్వరం మండల గిరిజన నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేఎల్లార్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. చైర్మన్‌ కుర్చీ కోసం ఆశపడి భంగపడిన గిరిజన నాయకులైన కృష్ణానాయక్‌, విఠల్‌నాయక్‌, రాజునాయక్‌, పాండునాయక్‌లను బుజ్జగించేందుకు కేఎల్లార్‌ మధ్యవర్తుల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:52 PM