ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కల్వకుర్తి అభివృద్ధే నా అభిమతం : కసిరెడ్డి

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:58 PM

ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప తనకు ఎవరిపై ద్వేషం లేదని, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన అభిమతమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో, కడ్తాల మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

కడ్తాలలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి, నాయకులు

ఆమనగల్లు/కడ్తాల్‌, అక్టోబరు 21(ఆంరఽధజ్యోతి): ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప తనకు ఎవరిపై ద్వేషం లేదని, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన అభిమతమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో, కడ్తాల మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై తహసీల్దార్లు లలిత, ముంతాజ్‌లతో కలిసి 85 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఆయా చోట్ల నిర్వహించిన సమావేశాల్లో కసిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తన గూర్చి వ్యక్తిగతంగా చేసిన విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, అభివృద్ధే తన అభిమతమని, తనను గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. జైపాల్‌యాదవ్‌ గూర్చి తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదని, ఇకపై ఒక్కమాట మాట్లాడబోనని, ఏదైనా సందర్భంవస్తే గారు అని సంభోదిస్తానని, తాను సంస్కారం తెలిసినవాడిని కాబట్టే జైపాల్‌ యాదవ్‌ను వ్యక్తిగతంగా దూషించకుండా పాలసీలపై మాత్రమే ప్రస్తావించానని, కేసీఆర్‌, కేటీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు కృషిచేయలేదని మాట్లాడానని స్పష్టంచేశారు. జైపాల్‌ యాదవ్‌ తనపై మాట్లాడిన భాష పదజాలం ఉచ్చరించరాని విధంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, కౌన్సిలర్‌ లక్ష్మణ్‌, మండల, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు జగన్‌, బీచ్యనాయక్‌, మానయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

నల్లవారి పల్లికి బీటీ రోడ్డు నిర్మాణం

మాడ్గుల మండలం నల్లవారిపల్లికి వీలైనంత త్వరగా బీటీ రోడ్డు నిర్మాణం చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంజూరైన రూ. కోటి నిధులకు తోడు అవసరమైతే మరో కోటి రూపాయాలు అందిస్తామన్నారు. నల్లవారిపల్లికి బీటీ రోడ్డు నిర్మించాలని సోమవారం గ్రామ నాయకులు ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అవురుపల్లి నుంచి నల్లవారి పల్లికి ఇప్పటికే మంజూరైన రోడ్డు నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయించాలని, నల్లవారి పల్లి నుంచి చంద్రాయన్‌పల్లికి, మాడ్గుల రోడ్డు నుంచి నల్లవారి పల్లికి బీటీ రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఏడాది లోపు చంద్రాయన్‌పల్లి, మాడ్గుల బీటీరోడ్ల నిర్మాణం చేయిస్తానని, మంజూరైన ఆవురుపల్లి- నల్లవారిపల్లి బీటీ రోడ్డు నిర్మాణం పనులు వీలైనంత తొందర ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలు విజయమ్మ, గ్రామ నాయకులు ఇటికాల వెంకట్‌రెడ్డి,హన్మంత్‌రెడ్డి, సుఖజీవన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, వరుణ్‌రెడ్డి, కిరణ్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, పెద్దయ్య, మల్లేశ్‌, సంపత్‌, తదితరులున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:58 PM