‘కేసీఆర్‌వి పగటి కలలు’
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:42 PM
అవినీతి కుంభకోణాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి ప్రజల చేత తిరస్కరణకు గురై అధికారం కోల్పోయిన మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉంటూ పగటి కలలు కంటున్నారని ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్‌లు అన్నారు.
కడ్తాల్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అవినీతి కుంభకోణాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి ప్రజల చేత తిరస్కరణకు గురై అధికారం కోల్పోయిన మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉంటూ పగటి కలలు కంటున్నారని ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్‌లు అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఇక అధికారం కల్ల అని అన్నారు. మక్తమాదారంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ నాలుగు నెలల కాలంగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌కు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కనబడుతాయన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొనడం హస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం దారిలో పెట్టేందుకు చర్యలు చేపట్టిందని నర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, బీచ్యనాయక్ లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయాక ప్రజలు, వారి సమస్యలు గుర్తొస్తున్నాయని వారు ఎద్దేవా చేశారు.
Updated Date - Nov 10 , 2024 | 11:42 PM