ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మైసిగండి బ్రహ్మోత్సవం

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:34 PM

భక్తి విశ్వాసాల ముక్తి ప్రధాత... పేదల ఇలవేల్పు... ఆపద మొక్కుల అమ్మ... శక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్న కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.

విద్యుత్‌ దీపాలంకరణలో మైసిగండి మైసమ్మ దేవాలయం

నేటి నుంచి ఉత్సవాలు షురూ

ఆరు రోజుల పాటు జాతర

ఆలయంలో పకడ్బందీగా ఏర్పాట్లు

కడ్తాల్‌ , నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ): భక్తి విశ్వాసాల ముక్తి ప్రధాత... పేదల ఇలవేల్పు... ఆపద మొక్కుల అమ్మ... శక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్న కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జాతరకు నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా కార్తీక పౌర్ణమి నుంచి కార్తీక పంచమి వరకు ఆరు రోజులపాటు కనుల పండువగా వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

కార్యక్రమాల వివరాలు

మైసిగండి బ్రహ్మోత్సవాల వివరాలను గురువారం ఆలయ కార్యనిర్వహణ అధికారి స్నేహలత వెల్లడించారు. ఈనెల 15న క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి, 16న చిన్నతేరు, విశేష పూజలు, 17న పెద్ద రథోత్సవం, 18న విశేష పూజలు, అమ్మవారికి బోనాలు, బండ్లు తిప్పుట, శత ఛండీ హోమం ప్రారంభం, 19న కార్తీక దీపోత్సవం, మహాలింగార్చన, పుష్పార్చన, 20న అమ్మవారికి వివిద కూరగాయాలతో అలంకరణ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఏర్పాట్ల పరిశీలన...

మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ సిరోలిపంతూ పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Nov 14 , 2024 | 11:34 PM