ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నర్సింగ్‌ కాలేజీ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:06 AM

కొడంగల్‌కు మంజూరైన నర్సింగ్‌ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సూచించారు.

అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

  • అధికారులకు వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆదేశం

కొడంగల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కొడంగల్‌కు మంజూరైన నర్సింగ్‌ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సూచించారు. గురువారం కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న గదులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నర్సింగ్‌ కళాశాలలో 60 మంది విద్యార్థులకు ప్రవేశాలతో పాటు వసతి సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. కళాశాలకు కావాల్సిన గదులను ఎంపిక చేసుకొని మరమ్మతులు చేపట్టేందుకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. కళాశాలతో పాటు వసతి గృహానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా టీఎ్‌సఎంఐడీసీ డిప్యుటీ ఇంజనీర్‌ సత్యనారాయణ, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లిల్లీ మేరీ, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింహరెడ్డి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎస్సై సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:06 AM