రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
కందుకూరు, సెప్టెంబరు 15: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన బర్తాకి జంగయ్య (57), యాక్టివాపై శనివారం సాయంత్రం కడ్తాల్ మండల కేంద్రంలోని సోదరి ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో నేదునూరు గేటు సమీపంలోని రైస్‌మిల్లు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కడ్తాల్ వైపు వెళుతున్న కారు డ్రైవర్ జంగయ్య స్కూటిని కారుతో ఢీకొట్టాడు. దాంతో జంగయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో నగరంలోని మలక్‌పేటలో గల యశోద ఆస్పత్రికి తరలించారు. జంగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి బావమరిది దోసాడ జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతారాం తెలిపారు.
Updated Date - Sep 15 , 2024 | 11:54 PM