ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాద ఘటనలో వ్యక్తికి జైలుశిక్ష

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:37 AM

రోడ్డు ప్రమాదం ఘటనలో వ్యక్తికి రెండున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి శ్రీరామ్‌ బుధవారం తీర్పును ఇచ్చినట్లు ఎస్‌ఐ జీవీ.సత్యనారాయణ తెలిపారు.

కొడంగల్‌, అక్టోబరు 9: రోడ్డు ప్రమాదం ఘటనలో వ్యక్తికి రెండున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి శ్రీరామ్‌ బుధవారం తీర్పును ఇచ్చినట్లు ఎస్‌ఐ జీవీ.సత్యనారాయణ తెలిపారు. ఏడేళ్ల కిందట మండలంలోని పర్సాపూర్‌కు చెందిన మోహన్‌ తాండూర్‌లో బంఽధువులను చూసేందుకు టవేరా వాహనంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్‌ సంతోష్‌ అజాగ్రత్త కారణంగా కొడంగల్‌ శివారులోని రామాలయం దగ్గర చొప్ప లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మోహన్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సందుల సరోజ ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ సంతోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్‌ను కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టులో దాఖలు చేయగా న్యాయమూర్తి శ్రీరామ్‌ రెండున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Updated Date - Oct 10 , 2024 | 07:10 AM