ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాధారణ ప్రసవాలు పెంచాలి : కలెక్టర్‌ శశాంక

ABN, Publish Date - Mar 16 , 2024 | 12:12 AM

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అత్యవసరమైతేనే సిజేరియన్లు చేయాలని, నార్మల్‌ డెలివరీలను పెంచాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ చట్టం, ఎంటీపీ, సరోగసీ చట్టాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అత్యవసరమైతేనే సిజేరియన్లు చేయాలని, నార్మల్‌ డెలివరీలను పెంచాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ చట్టం, ఎంటీపీ, సరోగసీ చట్టాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. సీ-సెక్షన్‌ ప్రసవాలను తగ్గించి ప్రజలకు మెరుగైన వైద్యమందించాలన్నారు. వైద్యులు సామాజిక దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. ఈ-బర్త్‌ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు. చట్టబద్ధ గర్భస్రావాలు చేసేటప్పుడు నిర్దిష్ట ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్‌ పద్మజ మాట్లాడుతూ సీ-సెక్షన్‌ డెలివరీ విధానంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్‌ అరుణకుమారి. జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య వైద్యులు, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:12 AM

Advertising
Advertising