ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బల్లికాదు.. ప్లాస్టిక్‌

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:41 PM

రాయల్‌ గ్రీన్‌మద్యంలో బల్లిఉందని ఆ మద్యం సీసా కొనుగోలు చేసిన సందీప్‌తో పాటు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రాయల్‌ గ్రీన్‌ బాటిల్‌లో వచ్చిన ప్లాస్టిక్‌ చూపిస్తున్న సీఐ రాగవీణ

వికారాబాద్‌, జూలై 26: రాయల్‌ గ్రీన్‌మద్యంలో బల్లిఉందని ఆ మద్యం సీసా కొనుగోలు చేసిన సందీప్‌తో పాటు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం సీఐ రాగవీణ మాట్లాడుతూ.. రాయల్‌ గ్రీన్‌ మద్యం సీసాలో ఉన్నది బల్లి కాదని, అది ప్లాస్టిక్‌ అని స్పష్టం చేశారు. అనంతగిరి వైన్స్‌లో రాయల్‌ గ్రీన్‌ కొనుగోలు చేయగా అందులో ప్లాస్టిక్‌ పడిఉందని అది చూసిన యువకులు బల్లి అనుకుని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు అందడంతో ఈ విషయం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌ భాస్కర్‌ గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో బాటిల్‌ను ఓపెన్‌చేసి చూసినట్లు తెలిపారు. అయితే, అందులో అందులో బాటిల్‌ పై భాగం ప్లాస్టిక్‌ మూత వేడి కారణంగా లోపలికి వెళ్లిందని తెలిపారు. పై నుంచి సీల్‌ చేయడం వల్ల మద్యంలో ప్లాస్టిక్‌ అలాగే పడిపోయినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన సందీప్‌ అతడి మిత్రులకు కూడా తెలియజేశామని తెలిపారు. ఎవరూ భయపడొద్దని సూచించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<