ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొనసాగుతున్న కులగణన ఆన్‌లైన్‌ నమోదు

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:13 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ఆన్‌లైన్‌ నమోదు వేగవంతంగా కొనసాగుతోంది.

వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సిబ్బంది

కులకచర్ల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ఆన్‌లైన్‌ నమోదు వేగవంతంగా కొనసాగుతోంది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలను సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు 2500 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేశామని తెలిపారు. కులకచర్ల మండలంలోని 15095 కుటుంబాలకు గాను 5150 కుటుంబాల వివరాలను నమోదు చేశామని తెలిపారు.

బషీరాబాద్‌ మండలంలో 53.7 శాతం పూర్తి

బషీరాబాద్‌: మండలంలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, ఉపాధి కులగణణకు సంబంధిన డాటా నమోదు ప్రక్రియ చకచకా కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆన్‌లైన్‌ నమోదును బషీరాబాద్‌ తహసీల్దార్‌ వై.వెంకటేష్‌, ఎంపీడీవో విజయ్‌కుస్వయంగా పరిశీలించారు. ఆపరేటర్లకు పలు సూచనలు చేవారు. మండల వ్యాప్తంగా 53.7శాతం నమోదు పూర్తయింది. ఇంకా 46.3 శాతం సర్వే నమోదు వేగవంతానికి తగిన చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.వారం రోజుల్లో వందశాతం పూర్తి చేయిస్తామన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:13 AM