ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రగతి నిరోధకంగా ప్రతిపక్షాలు : ఎంపీ

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:55 PM

రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయి అధికారానికి దూరమై బీఆర్‌ఎస్‌ నాయకులు ఉనికి కోసం విషరాజకీయాలు సాగిస్తున్నార ని, ప్రతిపక్షాలు ప్రగతి నిరోధకంగా మారాయని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు అహంకార పోకడలు వీడలేదని మండిపడ్డారు.

మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డిలను సన్మానిస్తున్న మండ్లీ రాములు

ఆమనగల్లు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయి అధికారానికి దూరమై బీఆర్‌ఎస్‌ నాయకులు ఉనికి కోసం విషరాజకీయాలు సాగిస్తున్నార ని, ప్రతిపక్షాలు ప్రగతి నిరోధకంగా మారాయని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు అహంకార పోకడలు వీడలేదని మండిపడ్డారు. ఆమనగల్లు పట్టణంలో ఆదివారం మల్లు రవి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మండ్లీ రాములు కార్యాలయంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతీది రాజకీయం చేస్తూ ప్రగతి నిరోధకంగా మారారని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవనానికి సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపడుతుంటే కాంగ్రె్‌సకు ఎక్కడ పేరు వస్తుందోనని విపక్షాలు అడ్డుకునే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పీసీసీ కార్యదర్శి మదుసూధన్‌రెడ్డి, ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కేశవులు, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు మండ్లీ రాములు, కాంగ్రెస్‌ పార్టీ ఆమనగల్లు పట్టణాధ్యక్షుడు వస్పుల మానయ్య, నాయకులు శ్రీను నాయక్‌, లక్ష్మణ్‌, యోగేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:55 PM