ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:31 PM

పెండింగ్‌ ధరణి దరఖాస్తులను వచ్చే రెండు నెలల్లో పరిష్కరించాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ ధరణి దరఖాస్తులను వచ్చే రెండు నెలల్లో పరిష్కరించాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పెండింగ్‌ ధరణి సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7600 ధరణి దరఖాస్తులను రాబోయే రెండు నెలల్లో పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ మాడ్యూల్స్‌ కింద దాఖలైన దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోజు వారీగా లక్ష్యాన్ని నిర్ణయించుకొని జనవరి 15వ తేదీ లోపు పెండింగ్‌ లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో సంగీత, ఏవో సునీల్‌, రెవెన్యూ సెక్షన్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:31 PM