ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుక్కలతో జనాల బెంబేలు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:14 AM

కుక్కలు బాబోయ్‌.. కుక్కలు అంటూ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు 29 గ్రామ పంచాయతీలలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చికెన్‌, మటన్‌ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపైనే పారవేస్తుండడంతో వాటిని తినడానికి షాపుల వద్ద కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి.

కేశంపేట మండల కేంద్రంలో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు

వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న శునకాలు

భయాందోళనలో ప్రజలు.. చర్యలు తీసుకోవాలని వేడుకోలు

కేశంపేట, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కుక్కలు బాబోయ్‌.. కుక్కలు అంటూ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు 29 గ్రామ పంచాయతీలలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చికెన్‌, మటన్‌ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపైనే పారవేస్తుండడంతో వాటిని తినడానికి షాపుల వద్ద కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి. అంతేకాకుండా కోళ్లఫాంల యజమానులు చనిపోయిన కోళ్లను ఆరుబయట పారవేస్తున్నారు. వాటిని తినడానికి కుక్కలు ఫామ్‌ల వద్ద తిష్టవేసుకుని ఉంటున్నాయి. కుక్కలు గుంపులుగా ఉన్నప్పుడు ఒంటరి మహిళలు, చిన్నారులపై తరచూ దాడులకు తెగబడుతున్నాయి. రోడ్లపై నుంచి వెళ్లే వాహనదారులపై కూడా దాడులు చేస్తున్నాయి. దాంతో కుక్కలను చూస్తేనే జనాలు జంకుతున్నారు. ఉదయం, రాత్రి వేళలలో దాడులు అధికంగా ఉంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం కేంద్రంలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని, ఉదయం దేవాలయాకు వెళ్తునప్పుడు వెంబడిస్తూ దాడికి ప్రయత్నిస్తున్నాయని వాపోతున్నారు. కాగా, అయ్యప్ప స్వాములము కుక్కల భయంతో ఎక్కడికెళ్లినా వారు కూడా గుంపుగా వెళ్తున్నామని చెబుతున్నారు. అంతేకాకుండా గొర్రెలు, మేకలపై దాడిచేసి చంపుతున్నాయని, గ్రామాలలో కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు చొరవతీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కుక్కల భయానికి గుంపులుగా వెళ్తున్నాం

అయ్యప్ప స్వాములందరం కలిసి వేకువ జామున లేచి... దేవాలయాలకు వెళ్తుంటాం. అయితే, ఒకరిద్దరు ఉంటే కుక్కలు వెంబడిస్తూ దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నాయి. దాంతో భయానికి స్వాములందరూ కలిసి గుంపుగా వెళ్తున్నాం. అధికారులు కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి.

- తలసాని రమణారెడ్డి, అయ్యప్ప స్వామి, కేశంపేట

Updated Date - Nov 24 , 2024 | 12:14 AM