అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:47 PM
తల్లి సంవత్సరీకం కోసమని వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివా్‌సగౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లికి చెందిన శేఖర్(40) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
తల్లి సంవత్సరీకానికి వెళ్తున్నానని చెప్పి కానరాని లోకాలకు..
ఫిట్స్ రావడంతోనే మృతిచెందినట్లు పోలీసుల అనుమానం
శంకర్‌పల్లి, నవంబరు15(ఆంధ్రజ్యోతి): తల్లి సంవత్సరీకం కోసమని వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివా్‌సగౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లికి చెందిన శేఖర్(40) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహం కాలేదు. శేఖర్ తండ్రి బాలరాజు 12 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లగా.. తల్లి లక్ష్మి రెండేళ్లక్రితం మరణించింది. శేఖర్‌కు అన్న ఆంజనేయులు, అక్క కల్పన ఉన్నారు. ఆంజనేయులు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కార్పెంటర్‌గా దుకాణం నడుపుతుండగా, శేఖర్ అక్కడే దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈక్రమంలో తల్లి సంవత్సరీకం ఉందని ఆంజనేయులుతో చెప్పి నాలుగు రోజుల క్రితం అక్కడి నుంచి బయలుదేరి పటాన్‌చెరువులో ఉండే అక్క కల్పన వద్దకు శేఖర్ వచ్చాడు. మూడు రోజుల క్రితం పటాన్‌చెరువు నుంచి బయలుదేరి మునిదేవునిపల్లికి వెళ్లకుండా శంకర్‌పల్లికి వచ్చాడు. అయితే, శంకర్‌పల్లికి ఎందుకు వచ్చాడనేది తెలియదు. శుక్రవారం శంకర్‌పల్లిలో శవమై కనిపించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మద్యం సేవించి, బహిరంగ మలవిసర్జన చేస్తుండగా ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు చిన్నపాటి గాయం కావడంతో చెట్లకు తల తగలడంతో అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు క్లూస్‌టీమ్, డాగ్‌స్వాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటానా స్థలం వద్ద దొరికిన ఫోన్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Nov 15 , 2024 | 11:47 PM