ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫార్మాసిటీ భూములను వెనక్కి ఇచ్చేయాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:55 PM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పన్ని తీసుకున్న ఫార్మసిటీ భూములను అఽధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. నేడు ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో సబితాఇంద్రారెడ్డి

కందుకూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పన్ని తీసుకున్న ఫార్మసిటీ భూములను అఽధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. నేడు ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 64మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను మండల పరిషత్‌ సమావేశ మందిరంలో అందజేశారు. సబిత మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్‌ అఽధికారంలోకి వచ్చాక రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో పెట్టలేదన్నారు. కౌలు రైతులు, కూలీలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరు, యాచారం మండలాల్లో సేకరించిన ఫార్మా భూములను తిరిగి రైతులకు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్యాక్స్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్లు శేఖర్‌రెడ్డి, ఆనంద్‌, తహసీల్దార్‌ కె.గోపాల్‌, ఎండీవో సరిత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, సురేష్‌, ఇందిర, కాకి రాములు, లలితకుమార్‌, మాజీ సర్పంచ్‌లు రామకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, కాకి ఇందిర, భూపాల్‌రెడ్డి, జంగయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:55 PM