ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:09 AM

కురుస్తున్న వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని, పత్తి పంటలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారులు సూచించారు.

చౌదరిగూడ : ఎల్కగూడలో వాడిపోయిన చేనును పరిశీలిస్తున్న అధికారి రాజేందర్‌రెడ్డి

మండల వ్యవసాయ శాఖ అధికారులు

వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో 150 ఎకరాల్లో నీట మునిగిన పత్తి పంట

చౌదరిగూడ/షాబాద్‌, సెప్టెంబరు 4: కురుస్తున్న వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని, పత్తి పంటలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారులు సూచించారు. బుధవారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల, ఎల్కగూడ గ్రామాల్లో పత్తి పంటలను మండల వ్యవసాయాధికారి రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు 150 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటికి తీసివేసుకోవాలన్నారు. ఏఈవో గౌరిప్రియ, రైతులు వెంకట్‌నర్సింహారెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వర్షాలకు దెబ్బతిన్న పత్తిపంటలకు యూరియా, పొటాష్‌ వంటి ఎరువులు వేసుకోవాలని షాబాద్‌ మండల ఏవో వెంకటేశం తెలిపారు. బుధవారం మల్లారెడ్డిగూడలో పత్తి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులు వేసుకోవాలని సూచించారు. ముంపునకు గురైన పంటలు త్వరగా కోలుకోవడానికి 19-19-19 లేదా, 13-0-45, 10 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. నేలద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు నివారించుటకు 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌, ఆల్టర్నేరియా, ఆకుమచ్చ తెగులు నివారణకు 2.5 గ్రాముల కార్బండిజిమ్‌, మ్యాంకేబేజ్‌ శిలీంద్రనాశక మందును లీట రు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు. రైతులు తదితరులున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:09 AM

Advertising
Advertising