ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొనుగోళ్లు వేగిరం చేయాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:14 AM

ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పీఏసీఎస్‌ 20, డీసీఎంఎస్‌ 7, ఐకేపీ 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించి 42 మంది రైతుల ఖాతాల్లో రూ.57.73 లక్షలు జమ చేసినట్లు చెప్పారు. ఇంకా 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఏఈవోలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాలు గుర్తించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్‌ మిల్లులకు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీలు త్వరగా చేయాలని సూచించారు. అలాగే 15 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1186 మంది రైతుల ద్వారా 7951 మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు చేసి, 39 మంది రైతుల ఖాతాల్లో రూ.89.84 లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతీ ఎన్యూమరేటర్‌ తమ పరిధిలోని ఏ ఒక్క ఇంటిని విడిచి పెట్టకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేష్‌ మోహన్‌, సీపీవో సౌమ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ, డీఎఫ్‌వో శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి రియాజుద్దీన్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:14 AM