హోటల్ భాగస్వాముల తగాదా
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:18 AM
హోటల్ భాగస్వాముల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బొంగ్లూరు వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
మాట్లాడుకుందామని చెప్పి కత్తితో దాడి
ఇద్దరికి కత్తి పోట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఆదిభట్ల, జూలై 2 : హోటల్ భాగస్వాముల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బొంగ్లూరు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్‌రెడ్డి, శరణ్‌రెడ్డిలు భాగస్వాములుగా బొంగ్లూర్ గేట్ వద్ద కృతుంగ పేరుతో రెస్టారెంట్(హోటల్)ను ఏర్పాటు చేశారు. కాగా హోటల్ వ్యాపారం సరిగా నడవకపోవడంతో దీపక్‌రెడ్డి అనే వ్యక్తి తన వాటాను ఇచ్చేయ్యాలంటూ శర్‌ణ్‌రెడ్డిని అడిగాడు. దాంతో శరణ్‌రెడ్డి హోటల్ ఏర్పాటు సమయంలో దీపక్‌రెడ్డి పెట్టిన పెట్టుబడి రూ.7లక్షలు ఇచ్చేశాడు. అయితే, తనకు గుడ్‌విల్ కింద మరో రూ.3లక్షలు ఇవ్వాల్సిందిగా దీపక్‌రెడ్డి డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా శరణ్‌రెడ్డితో గొడవకు దిగుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున దీపక్‌రెడ్డి.. శరణ్‌రెడ్డికి ఫోన్‌చేసి గుడ్‌విల్ డబ్బులు డిమాండ్ చేశాడు. హోటల్‌కు వస్తే మాట్లాడుకుందామంటూ శరణ్‌రెడ్డి తెలిపాడు. మంగళవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో దీపక్‌రెడ్డి హోటల్‌కు వచ్చి ఫోన్‌చేసి కిందికి రా అని అన్నాడు. శరణ్‌రెడ్డి కిందకు రాకపోవడంతో తన స్నేహితుడు వంశీతో కలిసి హోటల్ రూమ్ నెంబర్ 101లో మద్యం సేవించాడు. తరువాత శరణ్‌రెడ్డి దగ్గరికి వెళ్లి డబ్బుల విషయంలో గొడవకు దిగాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న దీపక్‌రెడ్డి తన వెంట తీసుకువచ్చిన కత్తిని జేబులో నుంచి తీసి శరణ్‌రెడ్డిపై.. అడ్డుగా వచ్చిన అతడి మేనళ్లుడిపై దాడి చేశాడు. దాంతో శరన్‌రెడ్డికి తలపై, మేనళ్లుడికి కడుపులో గాయమై రక్తస్రావం జరిగింది. నిందితుడు పారిపోవడంతో గాయపడిని ఇద్దరిని మన్నెగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Jul 03 , 2024 | 12:18 AM