ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ రేషన్‌కార్డులందిస్తాం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:17 AM

అర్హులైన ప్రతీ ఒక్కరికి త్వరలోనే రేషన్‌కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని బండోనిగూడ, బుగ్గోనిగూడలో రేషన్‌ దుకాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్థులు బస్సు సౌకర్యం కల్పించాలని శంకర్‌ను కోరారు.

కొత్తూర్‌ : రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

నందిగామ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి త్వరలోనే రేషన్‌కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని బండోనిగూడ, బుగ్గోనిగూడలో రేషన్‌ దుకాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్థులు బస్సు సౌకర్యం కల్పించాలని శంకర్‌ను కోరారు. మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నర్సింలు, నాయకులు పసుల బుచ్చయ్య, సాలయ్య, బుగ్గ నర్సింలు, కొమ్ము కృష్ణ, జిల్లెల్ల బాల్‌రెడ్డి, బండ మల్లేష్‌, దేపల్లి కుమార్‌గౌడ్‌, కావలి క్రిష్ణ, మంకాల శ్రీశైలం, శివ, నవీన్‌గౌడ్‌, రాజు, జెట్ట శ్రీశైలం, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి

కొత్తూర్‌ : నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృషి సారించామని ఎమ్మెల్యే శంకర్‌ తెలిపారు. సిద్దాపూర్‌ గ్రామపంచాయతీలోని చింతగట్టుతండా నుంచి పొల్కొనిగుట్టతండా వరకు రూ.92లక్షలతో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులు అంబటి ప్రభాకర్‌, శేఖర్‌రెడ్డి, జంగయ్య, కొమ్ము కృష్ణ, లింగారం సురే్‌షగౌడ్‌, రాంచందర్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌, రెడ్యానాయక్‌, హర్యానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

చౌదరిగూడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జీపీ కార్మికులను దూషిస్తున్న జిల్లేడ్‌ చౌదరిగూడ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే శంకర్‌కు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుద్దుల జంగయ్యతో కలిసి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జంగయ్య మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే గ్రామ పంచాయతీ కార్మికులే కారణమని, అలాంటి కార్మికులనే చౌదరిగూడ పంచాయతీ కార్యదర్శి పాండురంగంగౌడ్‌ మహిళలని చూడకుండా ఆసభ్యపదజాలంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, కార్యదర్శి కార్మికుల పట్ల అనుచిత మాటలు మాట్లాడటం సరైందికాదని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే కార్మికులకు హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కార్మికులు వీరేష్‌, జంగయ్య, పాపయ్య, లక్ష్మమ్మ, పార్వతమ్మ, పెంటయ్య తదితరులున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:17 AM