ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చిరువ్యాపారుల షెడ్ల తొలగింపు

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:16 AM

ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చినా ఆర్టీసీ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని అధికారులు వాటి తొలగింపు చర్యలు చేపట్టారు.

ఆర్టీసీ స్థలంలో ఉన్న రేకులషెడ్డును తొలగిస్తున్న ఆర్టీసీ అధికారులు

మర్పల్లి, జూన్‌ 15: ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చినా ఆర్టీసీ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని అధికారులు వాటి తొలగింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం పోలీసు బందోబస్తుతో చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకున్న రేకులషెడ్లను జేసీబీల ద్వారా తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో చిరువ్యాపారులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. షెడ్లను కూల్చివేయడంతో సామగ్రి ధ్వంసమవుతుందని, తమకు సమయం ఇవ్వాలని చిరువ్యాపారులు కోరారు. దీంతో పోలీసులు కల్పించుకొని మధ్యాహ్నం వరకు సమయం ఇస్తున్నామని, అప్పటిలోగా తమకు షెడ్లను తొలగించుకోవాలని సూచించారు. కొంత మంది వ్యాపారులు షెడ్లను తొలగించగా మరి కొంత మంది వ్యాపారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల సమయం కావాలని కోరారు. బక్రీద్‌ పండుగ ముగిసిన తర్వాత ఖాళీచేస్తామని ప్రజాప్రతినిధులకు తెలపడంతో ఆర్టీసీ, అధికారులతో వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు ససేమిర అనడంతో ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక సమయం ఇచ్చేదే లేదని తేల్చిచెప్పారు. కనీసం రెండు, మూడు రోజులైనా సమయం ఇవ్వాలని చిరువ్యాపారులు అధికారులను కోరారు.

వేలం దక్కించుకున్న వారికి అవకాశం

ఆర్టీసీ స్థలాన్ని వేలం వేసినట్లు అధికారులు తెలిపారు. వేలం దక్కించుకున్న వారు ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేస్తే అద్దెకు ఇచ్చే అవకాశంఉందని తెలిపారు. ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులను గుర్తించి షెడ్లను అద్దెకు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తామని అధికారులు హామీఇచ్చారు.

Updated Date - Jun 16 , 2024 | 12:16 AM

Advertising
Advertising