రేవంత్‌ది తుగ్లక్ పాలన
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:57 PM
తెలంగాణలో రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనకు తెరలేపాడని కర్ణాటకలోని బెల్గాం ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి అభయ్ పాటిల్ విమర్శించారు.
హైడ్రా పేరుతో పేదల్లో అలజడి
ఆరు గ్యారంటీల అమలెక్కడ?
కర్ణాటక ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి అభయ్ పాటిల్
షాద్‌నగర్ అర్బన్, అక్టోబరు 1: తెలంగాణలో రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనకు తెరలేపాడని కర్ణాటకలోని బెల్గాం ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి అభయ్ పాటిల్ విమర్శించారు. షాద్‌నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో మంగళవారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించగా అభయ్‌పాటిల్ హాజరై మాట్లాడారు. సమీక్షా అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్ కుటుంబ పాలనను కొనసాగిస్తూ, అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనపై విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోగా.. హైడ్రా పేరుతో పేద ప్రజల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నారని, ఆయన వైఖరి మార్చుకోకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, బీఆర్‌ఎస్ పాలనతో విసిగెత్తిన ప్రజలు కాంగ్రె్‌సకు అవకాశం ఇచ్చినా ప్రస్తుత పాలనపై ఆలోచన చేస్తున్నారని, బీజేపీ ఒక్కటే నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తుందని భావిస్తున్న ప్రజలు పార్టీ సభ్యత్వాన్ని అడిగిమరీ తీసుకుంటున్నారని అభయ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల సభ్యత్వాలు దాటాయని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవి, జిల్లాల అధ్యక్షులు బొక్కా నర్సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొండయ్య, పద్మజారెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, బాబయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకులు చెంది మహేందర్‌రెడ్డి, భూపాలాచారి, వెంకటేష్‌గుప్తా, కె.మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:57 PM