‘సీత్లా’ విగ్రహాల పునఃప్రతిష్ఠ
ABN, Publish Date - Jul 18 , 2024 | 12:25 AM
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎ్‌ఫసీనగర్ బ్యూటీ నెస్ట్ వెంచర్‌లో సీత్లా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను తొలగించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని గోర్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంజారాలు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు.
విగ్రహాలను తొలగించిన
వారిని అరెస్టు చేయాలని డిమాండ్
ఘట్‌కేసర్, జూలై 17: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎ్‌ఫసీనగర్ బ్యూటీ నెస్ట్ వెంచర్‌లో సీత్లా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను తొలగించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని గోర్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంజారాలు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. బంజారా సంఘం నాయకులు లింగయ్యనాయక్, రాములు మాట్లాడుతూ.. వర్షాలు కురవాలని, ప్రజలు, జీవులు సుభిక్షంగా ఉండాలని భక్తితో పూజలు చేస్తూ తాము సీత్లా పండుగ నిర్వహిస్తామన్నారు. కమిషనర్ సుచనల మేరకే పండుగ నిర్వహించుకున్నా కౌన్సిలర్ రమాదేవి కొందరితో కుమ్మక్కై తమ కుల దేవతల విగ్రహాలను తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అక్కసుతో విగ్రహాలను తొలగించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడాలకు కౌన్సిలర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. కాగా సీత్లా విగ్రహాల తొలగింపులో తన సంబంధం లేదని కౌన్సిలర్ కె.రమాదేవి అన్నారు. ఆమె మాట్లాడుతూ బంజారా సోదరులు నాలుగేళ్లుగా తనతో స్నేహపూర్వకంగా ఉన్నారన్నారు. కొందరు గిట్టని వారు తనను రాజకీయంగా దెబ్బ కొట్టాలని బంజారాలను తనపైకి ఉసిగొల్పే చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ఘటనపై పోలీసులే చూసుకుంటారన్నారు. ఓ మహిళా కౌన్సిలర్‌ను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు.
Updated Date - Jul 18 , 2024 | 12:25 AM