ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు పక్కన సర్వే ఫారాలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:47 PM

సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు మేడ్చల్‌ పట్టణ జాతీయ రహదారి పక్కన పడి ఉండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు పక్కన పడిపోయిన ఫారాలు

అధికారులకు సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్‌

స్వాధీనం చేసుకున్న మేడ్చల్‌ మున్సిపల్‌ కమిషనర్‌

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు మేడ్చల్‌ పట్టణ జాతీయ రహదారి పక్కన పడి ఉండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలో అత్వేల్లి సమీపంలోని రేకుల బావి నుంచి ఎల్లంపేట చౌరస్తా వరకు గల 44వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన గాలిలో ఎగురుతున్న సమగ్ర కుంటుంబ సర్వేఫారాలను గమనించి ఓఆటోడ్రైవర్‌ గురువారం సాయంత్రం మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మేడ్చల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి తన సిబ్బందితో ఫారాలు పడివున్న ప్రాంతానికి చేరుకుని వాటిని సేకరించి కార్యాలయానికి తీసుకొచ్చారు. కాగా ఫారాల్లో ఎలాంటి వివరాలు లేకుండా ఖాళీగా ఉండటం గమనార్హం. ఫారాలు తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై పడిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 500వరకు ఫారాలు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. సేకరించిన ఫారాలు పూర్తిగా చితికిపోవటంతో నిరుపయోగంగా మారాయని తెలిపారు. ఫారాలు సేకరించిన విషయంపై జిల్లా ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఫారాలు రోడ్డుపై పడి ఉండటం పట్ల అధికారులు విచారణ చేపట్టారని కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు.

Updated Date - Nov 14 , 2024 | 11:47 PM