బాధిత కుటుంబానికి సబితారెడ్డి పరామర్శ
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:07 PM
శంకర్‌పల్లి కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సబితారెడ్డి పరామర్శించారు. రాధా బాలకృష్ణ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.
శంకర్‌పల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శంకర్‌పల్లి కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సబితారెడ్డి పరామర్శించారు. రాధా బాలకృష్ణ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. కాగా, ఢిల్లీ నుంచి నేరుగా మంగళవారం సబిత శంకర్‌పల్ల్లికి చేరుకున్నారు. కుటుంబికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబితారెడ్డి రాజేంద్రనగర్ డీసీపీకి ఫోన్ చేసి చోరీ జరిగిన విషయం గురించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రోడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ నారాయణ. నాయకులు తదితరులున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య రాధ బాలకృష్ణ దంపతులను పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:07 PM