ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సర్వాయి పాపన్నగౌడ్‌ పేదల మనిషి

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:21 AM

సర్దార్‌ సర్వాయిపాపన్న గౌడ్‌ పేద ప్రజల మనిషి అని గౌడ సంఘం మండల అధ్యక్షుడు మాలే కృష్ణయ్యగౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలపూర్‌ రాములుగౌడ్‌ అన్నారు. పాపన్నగౌడ్‌ 314వ వర్థంతి సందర్భంగా మంగళవారం మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

తాండూరు రూరల్‌: గౌతాపూర్‌లో సర్వాయి పాపన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

కులకచర్ల, ఏప్రిల్‌ 2: సర్దార్‌ సర్వాయిపాపన్న గౌడ్‌ పేద ప్రజల మనిషి అని గౌడ సంఘం మండల అధ్యక్షుడు మాలే కృష్ణయ్యగౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలపూర్‌ రాములుగౌడ్‌ అన్నారు. పాపన్నగౌడ్‌ 314వ వర్థంతి సందర్భంగా మంగళవారం మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోల్కొండ సామ్రాజ్య స్థాపకుడు, పేద ప్రజలకు నేనున్నానని ధైర్యం కల్పించిన మహానీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జోగు వెంకటయ్యగౌడ్‌, బీజేపీ నాయకులు గాదే మైపాల్‌, శివకుమార్‌గౌడ్‌, విజయ్‌గౌడ్‌, రజక సంఘం నాయకులు వెంకటేశ్‌, దళితసంఘాల నాయకులు వెంకట్రాములు, జోగు రామచంద్రయ్యగౌడ్‌, రాములు, లింగంగారి రాములు, బైరం భీమయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతిని మండలంలోని గౌతాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గౌడ కులస్తులు మంగళవారం పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ రాజప్పగౌడ్‌ మాట్లాడుతూ అగ్రకుల పెత్తనాన్ని అణిచివేసేందుకు బహుజనులందరినీ ఏకం చేసిన వ్యక్తి పాపన్నగౌడ్‌ అని కొనియాడారు. పాపన్న ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, రిటైర్డ్‌ ఏఎస్‌ఐ వెంకటయ్యగౌడ్‌, మహేష్‌గౌడ్‌, బాలయ్య, రాజుగౌడ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బంట్వారం: బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని గౌడ సంఘం బంట్వారం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద మంగళవారం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, జగరీశ్వర్‌గౌడ్‌, బిక్షపతిగౌడ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:21 AM

Advertising
Advertising