ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ బియ్యాన్ని నూకలు చేసి విక్రయం.. వ్యక్తిపై కేసు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:51 PM

రేషన్‌ బియ్యాన్ని నూకలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.

ధారూరు, సెప్టెంబరు 15: రేషన్‌ బియ్యాన్ని నూకలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని మోమిన్‌కలాన్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోమిన్‌కలాన్‌ గ్రామానికి చెందిన కట్ట మాణిక్యప్రభు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని మిషన్‌(మర)లో వేసి నూకలుగా మారుస్తాడు. ఈ నూకలను కోళ్ల ఫారాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్‌ పోలీసులు గ్రామానికి వెళ్లి మాణిక్‌ ప్రభు ఇంట్లో తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 27.5 క్వింటాళ్ల నూకలు, 2.5క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాణిక్‌ ప్రభుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:51 PM

Advertising
Advertising