ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాజిక న్యాయమే కాంగ్రెస్‌ ధ్యేయం

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:53 PM

సామాజిక న్యాయం, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రజాపాలన ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు/మాడ్గుల, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రజాపాలన ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం అవురుపల్లిలో ఎస్సీ కమ్యూనీటి హాల్‌కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని, కురుమ కులస్థుల భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని గ్రామ నాయకులు, పలు సంఘాల నేతలు శనివారం ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మాజీ సర్పంచ్‌ గౌని నారాయణగౌడ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ నాగిళ్ల శ్రీరాములు, నాయకులు గౌని యాదయ్యగౌడ్‌, పోలె లక్ష్మయ్య, రవీందర్‌, శేఖర్‌, కొమురయ్య, కృష్ణయ్య, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి, నల్లచెర్వు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను నాయకులు, గ్రామస్తులు కోరారు. గిరికొత్తపల్లికి నైట్‌హాల్‌ బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరారు. అక్రమణకు గురైన రంగసముద్రం చెరువును కాపాడాలని, నల్లచెర్వులోని ఎస్సీ కాలనీలో 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయాలని కోరాగా ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. నల్లచెర్వు-అజిలాపూర్‌ మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆయా గ్రామస్తులు కోరారు. నల్లచెర్వుకు చెందిన ఎమ్మె పర్వతాలుకు మంజూరైన రూ.37,500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు ఎమ్మెల్యే అందజేశారు.

నిధుల కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

తలకొండపల్లి : మండల పరిధిలోని చంద్రధన ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి నిధులు కేటాయించాలని గ్రామ నాయకులు ఎమ్మెల్యే కసిరెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు రాజేందర్‌రెడ్డి, రవీందర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:53 PM