ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:11 AM

ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని కోరారు.

మాట్లాడుతున్న రవి

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 13 : ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇబ్రహీంపట్నంలో టీఎ్‌సయూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. యూటీఎఫ్‌ పోరాటం ఫలితంగానే స్పెషల్‌ విద్యావాలంటీర్లను ఉపాధ్యాయులుగా గుర్తించారని ఆయన అన్నారు. సీపీఎస్‌ రద్దు చేసేవరకూ ఉపాధ్యాయులంతా కలిసి రావాలన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాల సంక్షేమం కోసం ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి.. ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, నాయకులు సుగంధ, కిషన్‌ చౌహాన్‌, రామకృష్ణ, జగన్నాథశర్మ, నాగేంద్రం, అర్జున్‌రెడ్డి, కల్పన, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:11 AM

Advertising
Advertising