ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ కబడ్డీ పోటీలకు కడ్తాల ఆశ్రమ పాఠశాల విద్యార్థి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:14 AM

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కడ్తాల మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి రాజేందర్‌ ఎంపికయ్యాడు.

రాజేందర్‌ను అభినందిస్తున్న ఎంఈవో

కడ్తాల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కడ్తాల మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి రాజేందర్‌ ఎంపికయ్యాడు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన 68వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌ -14 బాలుర రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జట్టు తరపున 9వ తరగతి చదువుతున్న రాజేందర్‌ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. దీంతో అతన్ని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆశ్రమ పాఠశాల సంక్షేమ అధికారి బాలరాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కడ్తాల విద్యాశాఖ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు రాజేందర్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. జంగయ్య, బాలరాజు, భీముడు, మహ్మద్‌ సాబేర్‌, మంజుల ఉన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:14 AM