ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జిల్లాలోనూ ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:54 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మండలాల ఉపాధ్యాయులకు పదోన్నతి, బదిలీలు కల్పించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రమిచ్చారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రాన్ని ఇస్తున్న ఉపాధ్యాయులు

షాద్‌నగర్‌ అర్బన్‌/యాచారం/కేశంపేట/ఆమనగల్లు, జూన్‌ 8 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మండలాల ఉపాధ్యాయులకు పదోన్నతి, బదిలీలు కల్పించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రమిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేను ఉపాధ్యాయులు కలిసి సమస్యను వివరించారు. గత ప్రభుత్వం 317జీవో కింద రంగారెడ్డి జిల్లాకు అదనంగా ఉపాధ్యాయులు వచ్చారని తెలిపారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చిందని, స్టేను ఎత్తివేసి, బదిలీలు, పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలో టీచర్ల బదిలీల నిలుపుదల అన్యాయం అని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్తు పాండురంగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. 9ఏళ్ల తరువాత కూడా ఉపాధ్యాయ బదిలీలు చేయకపోవడం సరికాదన్నారు. విద్యా శాఖ అధికారులు, గత పాలకుల తప్పిదంతో జిల్లా నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని టీఎస్‌ పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు షెడ్యూల్‌ జారీ చేసి రంగారెడ్డి జిల్లాను మినహాయించడం సరి కాదని కేశంపేట మండల యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు కె.రామ్మోహన్‌,రవికుమార్‌ అన్నారు. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టకపోతే మారుమూల ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లు నష్టపోతారన్నారు. బదిలీలు, ప్రమోషన్ల నుంచి జిల్లాను మినహాయించడంతో తాము నష్టపోతామని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలతో పాటు షాద్‌నగర్‌ నియోజకవర్గ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎమ్మె ల్యే నారాయణరెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులకు 13 సంవత్సరాల నుంచి బదిలీలు, పదోన్నతులు కల్పించలేదన్నారు. ప్రభుత్వం కోర్టు స్టే తొలగేలా కృషిచేసి బదిలీ జిల్లాలోనూ ప్రక్రియను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వినతి ప్రతం అందజేసిన వారి లో పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు టి.వెంకట్‌రెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి, విజయ్‌సాగర్‌, శ్రీనివాససాగర్‌, కిష్టారెడ్డి, వేణుగోపాల్‌, రాజేశ్వర్‌రెడ్డి, పద్మావతమ్మ, నాగేంద్రం, దేవయ్య, పద్మజారాణి, వెంకటయ్య, రాములయ్య, భగవంత్‌, రవీందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నారు.

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:54 PM

Advertising
Advertising