ప్రమాదకరంగా తక్కళ్లపల్లి బ్రిడ్జి
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:06 PM
మండల పరిధిలోని హైదరాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై తక్కళ్లపల్లి బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బ్రిడ్జిపై పలుచోట్ల గుంతలు పడటంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆందోళనలో వాహనదారులు
మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు
యాచారం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని హైదరాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై తక్కళ్లపల్లి బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బ్రిడ్జిపై పలుచోట్ల గుంతలు పడటంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తాయి. పలుచోట్ల గుంతలున్నట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుంతల కారణంగా ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక వాహనాదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాలు నడుపుతున్నామని చెబుతున్నారు. ఇటీవల ఓ బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. బ్రిడ్జికి రెండుపక్కల ఉన్న రెయిలింగ్స్ కూడా పాడైపోయాయి. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో వాహనాలు పల్టీ ప డితే ప్రాణాలు గాలిలో కలవడం ఖాయమని సా ్థనికులు కలవరపడుతున్నారు. అధికారులు తక్షణమే గుంతలను పూడ్చి రెయిలింగ్ పనులు చే పట్టాలని వాహనాదారులు కోరుతున్నారు.
బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టండి
బ్రిడ్జిపై గుంతలను అధికారులు తక్షణమే పూడ్చాలి. గుంతల కారణంగా బైక్‌లు బోల్తాపడే ప్రమాదముంది. రెయిలింగ్ పాడై ఏళ్లు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేయడం లేదు. ఆర్‌అండ్‌బీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు తక్షణమే బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోతే ఆందోళన చేస్తాం.
- పి.శ్రీశైలం, తక్కళ్లపల్లి మాజీ ఉప సర్పంచ్
Updated Date - Nov 19 , 2024 | 11:06 PM