ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీలింగ్‌ భూమికి ఎసరు!

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:02 PM

అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఉండడంతో పాటు హైదరాబాద్‌ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో వందల కోట్ల విలువ చేసే సీలింగ్‌, భూదాన్‌, ఇనామ్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

ధ్రువ పత్రాలు లేకున్నా వెంచర్‌గా మారుస్తున్న సీలింగ్‌ భూమి

-15 ఎకరాలకు తప్పుడు పత్రాల సృష్టి

-రూ.100 కోట్ల విలువైన భూములు స్వాహా!

-ఆక్రమణలకు అడ్డాగా మారిన తుమ్మలూరు

-పట్టించుకోని రెవెన్యూ, పంచాయతీ అధికారులు

అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఉండడంతో పాటు హైదరాబాద్‌ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో వందల కోట్ల విలువ చేసే సీలింగ్‌, భూదాన్‌, ఇనామ్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రోజు రోజుకు భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు రియల్‌ వ్యాపారులు అందినకాడికి దండుకునేందకు అడ్డదారులు తొక్కుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి భారీ పరిశ్రమలతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్‌సిటీ వంటి ప్రాజెక్టులు వస్తుండడంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

మహేశ్వరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 247 లో 830 ఎకరాల భూమి ఉంది ఇందులో కొంత ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఉంది. ఇందులో దాదాపు 15 ఎకరాల సీలింగ్‌(మిగులు ) భూమికి తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా కబ్జాలో ఉన్న వారికి నయానో, భయానో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటున్న కొందరు రియల్‌ వ్యాపారులు తప్పుడు పత్రాలతో ఆ భూములను వెంచర్లుగా తయారు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కేవైసీ అప్‌డేట్‌ కాకపోవడంతో తప్పుడు పత్రాలు సృష్టించి రూ.కోట్ల విలువ చేసే సీలింగ్‌ భూములను ఆక్రమించుకుంటున్నారు కొందరు రియల్టర్లు. తుమ్మలూరు ఒక్కటే కాకుండా మండలంలోని నాగారం, రావిరాల, మంఖాల్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోనూ వందల ఎకరాల ప్రభుత్వ, భూదాన్‌, ఇనాం భూములతో పాటు చెరువులు, కుంటల భూములను కొందరు రియల్‌ వ్యాపారులు ఆక్రమించుకొని రూ. కోట్లు గడిస్తున్నారు.

భూ ఆక్రమణదారులపై చర్యలు తప్పవు

తుమ్మలూరులో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే పత్రాలు లేకుండా వెంచర్‌ చేయాలనుకుంటే హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతి ఇవ్వరు. సీలింగ్‌ భూములను కొనుగోలు చేస్తున్నవారు ఎవరైనా ఆ భూములను ఇతరులకు విక్రయించాలనుకుంటే అది తహసీల్దార్‌ కార్యాలయానికి రావాల్సిందే. తప్పుడు పత్రాలతో కూడిన భూములపై తగిన విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటాం.

-సైదులు, తహసీల్దార్‌ మహేశ్వరం

Updated Date - Nov 19 , 2024 | 11:57 PM