ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంటకు నిప్పు పెట్టిన రైతు

ABN, Publish Date - Sep 11 , 2024 | 11:44 PM

చేతికి వచ్చిన మినుము పంట ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే ముందు పంట దెబ్బతినడంతో రైతు కన్నీరుమున్నీరై పంటకు నిప్పు పెట్టాడు.

వర్షాలకు పాడైన మినప చేను

మర్పల్లి, సెప్టెంబరు 11: చేతికి వచ్చిన మినుము పంట ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే ముందు పంట దెబ్బతినడంతో రైతు కన్నీరుమున్నీరై పంటకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మర్పల్లి మండలం నర్సాపూర్‌ చిన్న తండాలో బుధవారం జరిగింది. తండాకు చెందిన రతన్‌సింగ్‌ అనే రైతు రూ.30 వేల పెట్టుబడి పెట్టి ఎకరా మినప పంటను సాగు చేశాడు. అంతా బాగానే ఉంది త్వరలో చేతికొస్తుంది అన్న సమయంలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తి నేలవాలి కుళ్లిపోయింది. దీంతో చేసేదేమి లేక ఆ పంటకు నిప్పంటించి లబోదిబోమన్నాడు. మర్పల్లి మండలంలోని నర్సాపూర్‌, పంచలింగాల తండాలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

పెట్టుబడి కూడా పోయింది

ఎకరా పొలంలో మినప పంటను సాగు చేశాను. విత్తనాలు, పురుగు మందుల కోసం రూ.10వేలు ఖర్చు చేశాను. ఈ భారీ వర్షంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే ముందు పంట కళ్ల ముందే పాడె తీరని నష్టం మిగిల్చింది.

-నారాయణ, రైతు, పంచలింగాల

Updated Date - Sep 12 , 2024 | 08:33 AM

Advertising
Advertising