పెద్దకొడుకుతో కలిసి చిన్న కుమారుడి హత్య
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:42 PM
చిన్నకుమారుడిని పెద్దకొడుకుతో కలిసి దారుణంగా హతమార్చిన ఓ తండ్రి ఉదంతం మండల పరిధిలోని గుడితండాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
మాడ్గుల మండలం గుడితండాలో ఓ తండ్రి ఘాతుకం
హత్యానంతరం పొలంలో పాతిపెట్టిన తండ్రీకుమారులు
ఆస్తి పంపకాలే కారణం.. ఆలస్యంగా వెలుగులోకి..
మాడ్గుల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): చిన్నకుమారుడిని పెద్దకొడుకుతో కలిసి దారుణంగా హతమార్చిన ఓ తండ్రి ఉదంతం మండల పరిధిలోని గుడితండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ జగదీష్ కథనం ప్రకారం.. గుడితండాకు చెందిన రాత్లావత్ సురే్‌ష(28) హైదరాబాద్‌లోని బాల్‌లింగంపల్లిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల దసరాకు సందర్భంగా గుడితండాకు అక్టోబరు 11న సురేష్ వచ్చి అందరితో కలసిమెలసి పండుగ జరుపుకున్నాడు. 13వ తేదీన తండ్రి లక్ష్మణ్, సోదరుడు నరేష్‌లు ఆస్తి పంపకాల విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో సురేష్‌కు మద్యం తాగించి తండ్రీకుమారులు కలిసి మాంసం కోసే కత్తితో నరికి చంపారు. అనంతరం ఊరి పరిసరాల్లోని పొలంలో పూడ్చిపెట్టారు. కాగా, ఆస్తి పంపకాలే హత్యకు గల కారణమని, సురేష్‌ను హతమార్చడానికి ముందస్తుగానే పొలంలో గొయ్యి తీసి ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా, హత్యానంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి పాతిపెట్టిన అనంతరం తండ్రీకుమారులు హైదరాబాద్‌కు వెళ్ళిపోయారని సీఐ తెలిపారు. అయితే, ఇటీవల నరేష్ తాగిన మైకంలో నోరుజారి తన తమ్ముడిని చంపి పొలంలో పాతిపెట్టామని తెలిసినవారితో చెప్పాడు. అనంతరం నేరుగా తండ్రీకుమారులు కలిసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు గుడితండాకు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గోతిలోంచి సురేష్ శవాన్ని బయటికి తీసి తహసీల్దార్ వినయ్‌సాగర్, సీఐ జగదీష్, డాక్టర్ జె.విష్ణులు పంచనామా నిర్వహించారు. డాక్టర్ శవపరీక్ష నిర్వహించారు. ఈమేరకు రాత్లావత్ లక్ష్మణ్, నరే్‌షలపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు.
Updated Date - Nov 08 , 2024 | 06:35 AM