పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:42 PM
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి అన్నారు.
పరిగి అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని సుల్తాన్‌పూర్ స్టేజి దగ్గర ఉన్న బలిమెరలో అమరుడైన విజయ్‌భాస్కర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘట్‌కేసర్ రూరల్: పోలీసు అమర వీరుల సంసర్మణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ ఆవరణలో సీఐ పరశురాం అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఐ శ్రీనివాస్, అడ్మిన్ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు నర్సింహ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:42 PM