ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ తీగలు తగిలి చెరుకు పంట దగ్ధం

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:46 PM

విద్యుత్‌ తీగలు తగిలి చెరుకు పంట దగ్ధమైంది. ఈ ఘటన బంట్వారం మండలంలో చోటు చేసుకుంది.

దగ్ధమైన చెరుకు పంట

బంట్వారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ తీగలు తగిలి చెరుకు పంట దగ్ధమైంది. ఈ ఘటన బంట్వారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తొర్మామిడికి చెందిన పంది లలిత అదే గ్రామంలో 2.26 గుంటల భూమిని కౌలుకు తీసుకుని చెరుకు పంటను సాగు చేసింది. అయితే శుక్రవారం ఉదయం సమయంలో పంట పొలంపై నుంచి ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి చెరుకు పంటకు మంటలు వ్యాపించాయి. సుమారు ఎకర చెరుకు పంట అగ్నికి ఆహుతైంది. దీంతో సదరు రైతుకు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటు చేసుకుందని, ఎన్నిసార్లు విద్యుత్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి పండించుకున్న పంట దగ్ధమైందని వాపోయింది. తమకు జరిగిన నష్టం పై అధికారులు చర్యలు తీసుకుని పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు లలిత కోరింది.

Updated Date - Nov 29 , 2024 | 11:46 PM